Monday, January 20, 2025

రైతు భరోసాపై బిఆర్‌ఎస్ నిరసనలు

- Advertisement -
- Advertisement -

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేసిన ప్రకటనపై
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన బిఆర్‌ఎస్ శ్రేణులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో బిఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో ఆందోళనలు చేశారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు, రైతులు నిరసన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ శవయాత్రను ఊరేగింపుగా నిర్వహించారు. ఆర్మూర్ మండలం మాణిక్ బండారు చౌరస్తాలో ఖరీఫ్ పంటకు రైతు భరోస ఇవ్వటం లేదని నిరసనగా ఆర్మూర్- నిజామాబాద్ రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ధర్నాలో బిఆర్‌ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహేశ్వరంలో రైతు భరోసా వెంటనే అమలు చేయాలని మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపి, అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేశారు. సిఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం చేశారు. నల్గొండ జిల్లా చండూర్‌లోని స్థానిక చౌరస్తాలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద.. రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు భరోసా వెంటనే ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. హనుమకొండ జిల్లాలో రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ కాజీపేట చౌరస్తాలో ధర్నాకు దిగారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో రేవంత్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో బిఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్‌ఎస్ నాయకులు నిరసన ఆందోళన చేశాఉ.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News