Thursday, November 14, 2024

దళితులకు బిఆర్‌ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని అనంతరం గ్రా మంలో మంగళవారం దళిత మహిళను దూషించిన బిఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దళిత మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రహదారి బ ంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 17వేల కోట్లు దళిత బంధు పథకం ద్వారా ద ళితులకు కుటుంబాలకు పది లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటనలు చేశారు కానీ దళిత బంధు పథకం కేవలం కాగితాలకే పరిమితం చేశారని ఆయన ఆరోపించారు.

దళితులకు మూడు ఎకరాలు భూమి, డబుల్ బెడ్ రూమ్, రైతులకు రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, దళితులకు 12 శాతం రిజర్వేషన్లు, జిల్లాలో మెడికల్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, లతో పాటు వివిధ రకాల పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆ యన మండిపడ్డారు. ఎన్నికలు ముందు పథకాలు గుర్తుకొస్తాయి కానీ వాటి అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్వీర్యం అవుతుందని ప్రశ్నించారు. అనంతారం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ దళిత బంధు అడిగితే తప్పేంటన్ని ప్రశ్నించారు, ఓ బాధ్యత గల ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఆ ఎమ్మెల్యేపై ఉంటుంది కాబట్టి అడగవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందని అలా అడిగితే ఇలా రౌడీల ప్రవర్తిస్తారా..? అన్ని మండిపడ్డారు.

దళిత మహిళ అని చూడకుండా తన బాధ్యతను భంగం కలిగించి, అవమానపరిచి దూషించిన వ్యక్తులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామంలో దళిత బ ంధుతో పాటు గిరిజన బంధు కూడా వెంటనే అమలు చేసి తక్షణమే బాధితులకు అందేలా చూడాలని ఆయన కోరారు. కర్ణాటక రాష్ట్రం వల్లే తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, దళితులకు మేలు చేసి పార్టీగా ఇందిరమ్మ రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారని అన్నారు.

అధికార అహంకారాన్ని అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో అధికార పార్టీకి నిరసన సెగలు మొదలయ్యాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పా ర్టీ భారీ మెజార్టీతో గెలిచి అధికారం దక్కించుకుంటుందని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, వడ్డిచెర్ల క్రిష్ణాయాదవ్, వలందాస్ ఆదినారాయణ, కోటస్వామి, పాశం శివానంద్, ఎడ్ల శ్రీనివాస్, నాన్నం కృష్ణా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News