సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రత పెంచారు. గాంధీ ఆస్పత్రి వద్ద బిఆర్‌ఎస్ నేతల పర్యటన దృష్ట్యా భద్రతను పెంచారు. గాంధీ ఆస్పత్రిలోకి బిఆర్‌ఎస్ నేతలు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సంజయ్ , గోపినాథ్, ఆనంద్‌లో గాంధీ ఆస్పత్రికి బయలుదేరారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం కమిటీని బిఆర్‌ఎస్ అధిష్ఠానం ఏర్పాటు చేసింది.
వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్‌తో బిఆర్‌ఎస్ కమిటీ వేశారు. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురికి బిఆర్‌ఎస్ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని బిఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బిఆర్‌ఎస్ నేతలు గాంధీ ఆస్పత్రికి వెళ్తామంటే భయమెందుకని అడిగారు. గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని, ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని భయపడుతున్నారా? అని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు.