- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్(హెచ్‌సిఎఎ) ఉపాధ్యక్షులుగా బిఆర్‌ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇంఛార్జ్ 303 ఓట్ల మెజారిటీతో చెంగల్వ కళ్యాణ్‌రావు ఎన్నికయ్యారు. శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో కళ్యాణ్‌రావుకు 1,115 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శ్రీనివాసచారికి 812 ఓట్లు వచ్చాయి. బిఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కళ్యాణ్‌రావు గతంలో హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.
- Advertisement -