Thursday, January 23, 2025

నేటి నుంచి బిఆర్ఎస్ శాసనసభ విస్తృతస్థాయి సమావేశాలు

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్ సభ ఎన్నికలపై భారత రాష్ట్రసమితి ( బిఆర్ఎస్) కసరత్తు ప్రారంభించింది. శనివారం నుంచి బిఆర్ఎస్ శాసనసభ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. శనివారం సిద్దిపేట, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి భేటీలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యచరణపై కసరత్తులు చేయనుంది. ఇప్పటికే 17 లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల పదో తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు బిఆర్ఎస్ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News