Wednesday, January 1, 2025

బిఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఫ్లోర్ లీడర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రధాన పార్టీ నుంచి అసంతృప్తి నేతల వలసలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ట్రెండ్‌కు కొనసాగింపుగా, అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నుండి పలువురు నాయకులు మంగళవారం నాడు కాంగ్రెస్‌లో చేరారు.

నేతల జాబితాలో బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌, మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, కల్వకుర్తి, షాద్‌నగర్‌, కొడంగల్‌ నుంచి మాజీ ఎంపీపీలు, వార్డు మెంబర్లు, బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నేతలందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News