Thursday, December 26, 2024

బిఆర్‌ఎస్ అంటేనే అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం రోజున మంత్రి కేటీఆర్ విచ్చేసి 618 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసి భారీ బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం ఓసిటీలోని నూతన క్యాంపు కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేటీఆర్ ఓరుగల్లు పర్యటన వరంగల్ కు మహర్ధశ వచ్చింది. నియోజకవర్గ రాజకీయానికి దశ దిశ ఇవ్వడం మంచి పరిణామం, బతుకమ్మ, బోనాలు, వాయిధ్యాలు, డప్పు చప్పులతో పెద్ద ఎత్తున కెటిఆర్‌కి స్వాగతం పలికి సభ నిర్వహించుకోవడం శుభసూచికం, సభ నిర్వహణ జన సంద్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో మంచిగా పని చేసుకుంటున్నావ్ అని మంత్రి కితాబు ఇచ్చారు. నియోజకవర్గంలో అందరూ సమిష్టిగా పని చేసి అభివృద్ధి కార్యాక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం,సభ నా భూతొ నా భవిష్యత్తులా నిర్వహించాం. కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు,ఇంచార్జ్ బాద్యులు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, రాబోవు రోజుల్లో ప్రజల అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకొని పోతాం.

నియోజకవర్గానికి విచ్చేసి రూ.618కోట్ల పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు, నిన్న రోజు మొత్తము నియోజకవర్గానికి కేటాయించిన మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించి మా ఆతిధ్యం స్వీకరించిన మంత్రికి కృతజ్ఞుడిని, కలెక్టర్,పోలీసు అధికారులకు కృతజ్ఞతలు, ఈ కార్యక్రమానికి సహకరించిన కార్పొరేటర్లు, మాజీకార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు,ఇంచార్జ్ బాద్యులు,యూత్ నాయకులు మహిళ నాయకురాలులు, మీడియా ప్రతినిధులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు,హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News