Friday, December 20, 2024

బిఆర్ఎస్ సభ్యులను సస్పెండ్‌ చేయాలి: అక్బరుద్దీన్‌ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ సభ్యులపై ఎంఐఎంఏ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్‌ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఫార్ములా ఈ రేసుపై చర్చించాలని బిఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి రచ్చ రచ్చ చేశారు. సభలో ఆందోళన చేపట్టారు. దీంతో బిఆర్ఎస్ సభ్యుల తీరుపై అక్బరుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. ఆందోళన చేసే బిఆర్ఎస్ సభ్యులను సస్పెండ్‌ చేయాలి ఆయన డిమాండ్ చేశారు.

సభను ఆర్డర్‌లో పెట్టాలని అక్బరుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఇది చీకటి రోజు అని, బిఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ నేర్పింది ఇదేనా అని ప్రశ్నించారు. సభలో వారి తీరు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ధరణి వల్ల వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని, ధరణి ఉన్న లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని అక్బరుద్దీన్‌ ఓవైసీ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News