Monday, December 16, 2024

అసెంబ్లీ నుంచి బిఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌..

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సోమవారం ఉదయం మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ.. సర్పంచుల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ. 691 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి విమర్శించారు.

ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెడుతున్నారని నిలదీశారు. గవర్నర్‌, మంత్రులను కలిసి సర్పంచులు మొరపెట్టుకున్నారని.. చలో అసెంబ్లీ చేపడితే నిరసనకారులను అరెస్టు చేశారని చెప్పారు. అయితే, సర్పంచుల పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వట్లేదని బిఆర్ఎస్ మెంబర్స్ నిరసన తెలుపుతూ..శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News