Wednesday, January 22, 2025

మూడు గంటల మంటలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ చుట్ట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చా లన్న పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్, కాంగ్రె స్ నడుమ మాటల యుద్ధంతో పాటు నిరసనలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన పిలుపుమేర కు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో తొలిరోజైన సోమవారం నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున తీ ర్మానాలు చేశారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు రేవం త్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు సంధిస్తూ నే ఉన్నారు. ఉచిత విద్యుత్‌పై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, సబ్‌స్టేషన్ల వారీగా చర్చలు జరిపేందుకు సిద్ధ్దమని కాంగ్రెస్ నేతలు సవాల్ చేశా రు. కాంగ్రెస్ నాయకుల సవాళ్లకు దీటుగా అధికార బిఆర్‌ఎస్ పార్టీ మంత్రులు, ఎంఎల్‌ఎలు,

స్థ్దానిక ప్ర జాప్రతినిధులు అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో కాం గ్రెస్ పార్టీ ఆరోపణలు ఖండిస్తూ పెద్ద ఎత్తున తీర్మానాలు చేశారు. ఇలా అధికార బిఆర్‌ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఉచిత విద్యుత్ మంటలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ చుట్టూనే ఇరుపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు రైతు వేదికల్లో పాల్గొన్ని ఉచిత విద్యుత్‌కు అనుకూలంగా తీర్మానాలు చేశారు. పలుచోట్ల రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల జోలికి వస్తే ఆ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. ప్రతి రైతు వేదిక వద్ద సుమారుగా వెయ్యిమందికిపైగా రైతులు పాల్గొన్ని సిఎం కెసిఆర్‌తో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ మనస్సులో ఉన్న మాట రేవంత్‌రెడ్డి బయట పెట్టారు : వేముల ప్రశాంత్‌రెడ్డి
పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ మనస్సులో ఉన్నమాటనే బయటపెట్టాడని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తారని అదే పాలసీ తెలంగాణలో అమలు చేస్తారని రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు రైతు వేదిక వద్ద జరిగిన నిరసన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి నోటి నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు అని యాక్సిడెంటల్‌గా రాలేదని, కాంగ్రెస్ పార్టీ విధానాన్నే ఆయన పేర్కొనట్లు తెలిపారు.

24 గంటల కావాల్సిందే: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
రైతులకు 3 గంటల విద్యుత్ వద్దు.. 24 గంటల కావాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీర్మానం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం రూ. 70 వేల కోట్ల రైతు బంధును రూ. 12 వేల కోట్ల విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మోటార్లు స్టార్టర్లు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారని గుర్తుచేశారు. రాత్రి సమయాల్లో విద్యుత్ ఇవ్వడంతో రైతులు పాములు, తేళ్ల కాట్లకు గురై చనిపోయే వారన్నారు. రేవంత్‌రెడ్డి అసలు రైతే కాదని, అతనికి వ్యవసాయం పట్ల అవగాహన లేదన్నారు. కెసిఆర్ వ్యవసాయాన్ని ఒక పండుగలా చేశారని, తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.

ముక్కు నేలకు రాయాలి: మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్
వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పకుంటే వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మండల పరిధిలోని ఓబులాయపల్లి రైతు వేదికలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సమావేశానికి హాజరై రైతులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుకు ఎన్నడు ప్రయోజనం చేకూరలేదన్నారు.

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ : నామా నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంటు చాలన్నదే పార్టీ విధానమని స్వయంగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించడం ద్వారా ఆ పార్టీ అసలు రంగు తేటతెల్లమైందని బీఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మండి పడ్డారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరమే లేదు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలి అని అనేక మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడు తున్నారని విమర్శించారు. కరెంట్ వెలుగుల బీఆర్‌ఎస్ ఉండాలా.. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా రైతన్నలు ఆలోచన చేయాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు ఊరికో విధానం ఉంటుందా?: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు ఊరుకో విధానం, రాష్ట్రానికో విధానం ఉంటుందా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ విజయ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధమైన పథకాలు.. తెలంగాణలో విధమైన పథకాలు మేనిఫెస్టో ద్వారా హామీలు ఇవ్వడం సిగ్గుగా ఉందన్నారు. పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయపరంగా పండగ చేసుకుంటున్నారని, వారి ఆశలను అడిషనల్ గా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే 24 గంటలు కరెంటు వద్దనే సిగ్గులేని మాటలు మాట్లాడటం దుర్మార్గమన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా కెసిఅర్ పాలన : ఎంఎల్‌ఎ నోముల భగత్ యాదవ్
రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఅర్ పాలన సాగుతుందని ఎంఎల్‌ఎ నోముల భగత్ అన్నారు. అనుముల మండలం రామడుగు గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని, వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందా అని అన్నారు. రెండు పంటలకు కరెంటు ఇచ్చే కెసిఆర్ కావాలా.. రోజుకు మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు.

కాంగ్రెస్ పాలన పునరావృతం కావొద్దు : మాజీ మంత్రి జోగు రామన్న
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. మూడు గంటల విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెడతామన్న బిజెపిలు అన్నదాతల మీద కక్ష సాధించే విధంగా వ్యహారిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, ప్రతిపక్షాల వైఖరిపై గ్రామ గ్రామాన తిరుగుబావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

రైతును రాజు చేయడమే కెసిఆర్ లక్షం : షాద్‌నగర్ ఎంఎల్‌ఎ అంజయ్యయాదవ్
నిరంతరం విద్యుత్‌ను అందజేస్తూ ఏడాదికి మూడు పంటలను పండించే విధానం కెసిఆర్ ప్రభుత్వ విధానమైతే మూడు గంటల సరఫరా కాంగ్రెస్ విధానమని షాద్‌నగర్ ఎంఎల్‌శ్రీ అంజయ్యయాదవ్ అన్నారు. ఉచిత విద్యుత్ అంశం విషయంలో కాంగ్రెస్ వ్యాఖ్యాలను నిరసిస్తూ నందిగామ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రం అవిర్భావం తర్వాత రాష్ట్రంలో అదనంగా 12లక్షల విద్యుత్ కనెక్షన్లు పెరిగాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News