Monday, December 23, 2024

కెటిఆర్ బర్త్ డే… పైలెట్ నవ్యకు సహాయం చేసిన బిఆర్ఎస్ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పైలెట్ నవ్యకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ క్రింద ఆర్థిక సాయం అందజేశారు. విరివిగా విరాళాలు అందజేసి నవ్యకు అండగా నిలవాలని దాతలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన వేల్పుల నవ్య చదువులో అద్భుత ప్రతిభ కనబరుచుతూ పైలెట్ శిక్షణకు ఎన్నికయింది. ఫ్లయింగ్ శిక్షణ కోసం ప్రభుత్వం 36 లక్షల స్కాలర్షిప్ అందజేస్తుండగా గ్రౌండ్ శిక్షణ కోసం మూడు లక్షలు నవ్య భరించవలసి ఉంటుంది. నిరుపేద కుటుంబం కావడంతో ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో దాతల సహకారం కోసం ఎదురుచూసింది.

సామాజిక మాధ్యమాల్లో నవ్య గురించి వచ్చిన వార్తలను చూసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పందించారు.రాష్ట్ర ఐటి పురపాలక శాఖ, మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన జన్మదినం సందర్భంగా పేదలకు సహాయం చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు ఆయన జన్మదినం రోజున నవ్య కుటుంబ సభ్యులను గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి కుటుంబ వివరాలు, పైలెట్ శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కెటిఆర్ బర్త్ డే సందర్భంగా శిక్షణ కోసం 50,000 రూపాయలను అందజేశారు. దాతలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నవ్య పైలట్ శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News