Monday, December 23, 2024

బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్!

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారంనాడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వెంకటరావుకు రేవంత్, మంత్రి పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లం వెంకట్రావు కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో కలసి తిరుగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ తో టచ్ లో ఉంటూ వచ్చారు.

తెల్లం చేరికతో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంతకుముందు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News