Wednesday, January 22, 2025

కెసిఆర్ కు షాక్.. చంద్రబాబుతో బిఆర్ఎస్ నేతలు భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో టీడీపీలో చేరుతానని బిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లో బిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో జాయింగ్ తోపాటు పలు అంశాలపై వారు చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం.

సమావేశం అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని చెప్పారు. తెలంగాణలో టిడిపికి చాలా మంది అభిమానులు ఉన్నారన్నారు. తాను టిడిపిలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News