Sunday, December 22, 2024

కెటిఆర్‌తో మల్లారెడ్డి భేటీ… పార్టీ మార్పుపై క్లారిటీ

- Advertisement -
- Advertisement -

మాజీ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం కలిశారు. కుమారుడు భద్రారెడ్డితో పాటు కెటిఆర్ తో భేటీ అయ్యారు. గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మల్కాజిగిరి ఎంపి స్థానానికి తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నాడని తెలిపారు. నేడు కెటిఆర్ ను కలిసిన సందర్భంగా భద్రారెడ్డి లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి వివరణ ఇస్తూ తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కళాశాల భవనాల కూల్చివేత గురించి కలిసినట్లు మల్లారెడ్డి తెలిపారు. తాను పార్టీ మారడం లేదని కెటిఆర్ తో మల్లారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News