Wednesday, January 22, 2025

ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉంటారని మాజీ కార్మిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గెలవగానే కాంగ్రెస్ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ఏ హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అన్నారు.

మేయర్, ఛైర్ పర్సన్ పదవుల కోసం అవిశ్వాసాలు పెడతారు… గ్రూపు తగాదాలతో అవిశ్వాసాలు పెట్టడం సర్వసాధారణం అన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సర్దిచెబుతున్నానని మాల్లారెడ్డి పేర్కొన్నారు. బిఆర్ఎస్‌ కాదు, కాంగ్రెస్ వెయ్యి మీటర్ల లోతున ఉందని జోస్యం చెప్పారు. మేడ్చల్ పరిధిలోని నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించింది తానేనని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News