- Advertisement -
బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున సభ జరగనుంది. ఈ సభకు వెళ్లేందుకు భారీ ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బయల్దేరుతున్నారు. ఈ సభకు వెళ్తున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రహదారి మధ్యలో రామక్క పాటకు డ్యాన్స్ చేశారు. తన స్టెప్పులతో బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా వేసిన మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -