Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చిన మరో ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీని వరసగా ఎంఎల్‌ఎలు, ఎంపిలు వీడుతున్నారు. తాజాగా బిఆర్‌ఎస్ పార్టీ చెందిన రాజేంద్రనగర్ ఎంఎల్‌ఎ ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డిని ప్రకాశ్ గౌడ్ కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సిఎంకు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో అతి త్వరలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌కు చెందిన ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. అనేక మంది ఎంపిలు, బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News