Tuesday, January 21, 2025

కాంగ్రెస్‌లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బిఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరోసారి సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నేడు లేదా రేపు రేవంత్ సమక్షంలో ప్రకాశ్ గౌడ్ తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. 2024 జనవరి 28వ తేదీన ప్రకాశ్ గౌడ్ సిఎం రేవంత్ ను కలిశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే తాను పార్టీ మారడం లేదని నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే సిఎంను కలిసినట్లు చెప్పారు. ప్రస్తుతం శుక్రవారం మరోసారి సిఎం రేవంత్‌ను కలవడంతో ప్రకాశ్ గౌడ్ చేరిక ఖాయమైనట్లుగా తెలుస్తోంది. బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రకాశ్ గౌడ్ కూడా పార్టీ మారితే బిఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News