Monday, December 23, 2024

నేడు కాంగ్రెస్‌లోకి మరో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ ప్రకాశ్ గౌడ్ శుక్రవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఏడుగురు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తాజాగా సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, పాటు పలువురు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్‌లో చేరిక విషయం ఎంఎల్‌ఎ ప్రకాష్ గౌడ్ ధ్రువీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News