Friday, April 11, 2025

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్: కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన సభలో ఖానాపూర్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మూడు రోజుల విజయవంతమైన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ఆర్మూర్ సభతో ముగిసింది. అక్టోబర్ 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్, ప్రియాంక గాంధీ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగింది. ఆర్మూర్‌ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లనున్న రాహుల్‌, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News