Monday, January 20, 2025

గురుకుల విద్యను నిర్లక్ష్యం చేస్తోన్న రేవంత్ సర్కార్:ఎంఎల్‌ఎ సంజయ్

- Advertisement -
- Advertisement -

గురుకుల విద్యావ్యవస్థను రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్షం చేస్తోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో గత ఏడు నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారని, సుమారుగా 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఎంఎల్‌ఎ సంజయ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఇంతకు ముందు మంచాన పడ్డ మన్యం అని వార్తలు చూసేవాళ్లమని, కెసిఆర్ పదేండ్ల పాలనలో ఆ న్యూస్ కనబడకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అని రోజు వార్తలు వస్తున్నా యన్నారు.

విద్యార్థుల మరణాలపై మంత్రులు, అధికారుల నుంచి స్పందన లేదన్నారు. తన సొంత నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని, వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. ప్రభుత్వం వైపు నుంచి విచారణ కూడా జరగలేదన్నారు. గురుకుల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బిఆర్‌ఎస్ హయాంలో 1200 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకు న్నారని గుర్తు చేశారు. కానీ నేడు అధికారులు నిర్లక్షం వహిస్తున్నారన్నారు. నాసిరకమైన భోజనాన్ని పిల్లలకు అందించడంతో వారు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారన్నారు. హాస్టళ్లలో పాములు, ఎలుకలు ఉండడంతో విద్యార్థులు నానా అగచాట్లకు గురవుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News