Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సాయన్న కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ బి సాయన్న(72) కన్నుమూశారు. సాయన్న గత కొంత కాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని బిఆర్‌ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇవాళ తెల్లవారుజామున షుగల్ లేవల్స్ పడిపోవడంతో యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సాయన్న టిడిపితో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1994 నుంచి 2009 మధ్య టిడిపి నుంచి మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. 2014-2015లో టిటిడి మెంబర్‌గా పని చేశారు. 2014లో టిడిపి నుంచి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో టిఆర్ఎస్ నుంచి ఎంఎల్‌ఎగా గెలిచారు. సాయన్న మృతిపట్ల మంత్రి కెటిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News