Thursday, January 23, 2025

బాబ్లీ కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రాంత రైతుల భూముల ఎడారిగా మారుతుంటే చూస్తూ ఉండలేక ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టి ఆందోళనలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం మహారాష్ట్రలోని “బిలోలి సేషన్” కోర్టులో “బాబ్లీ కేసు” విషయంపై విచారణకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లుహన్మంతు షిండే,కె ఎస్ రత్నం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగాఆనాడు ధర్నా చేసేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు మరో 14 మంది ఆందోళన లో పాల్గొనడం జరిగిందని.. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తమ పై లాఠీ చార్జి చేయడంతో పాటు నాన్ బెయిలేబుల్ కేసులు పెట్టిందని అన్నారు. తెలంగాణకు వర ప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా బాబ్లీపై నిర్మిస్తున్నా అక్రమ ప్రాజెక్టులకు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం జరిగిందని అన్నారు. ఆనాడు అక్రమంగా లాఠీఛార్జ్ చేసి తీవ్రంగా గాయ పరిచారని, శ్రీరాంసాగర్ పైన ఆధారపడి ఉన్న లోయర్ మానేర్ డ్యాం మిడ్ మానేర్ ప్రాజెక్టులకు నీరు రాకుండా అప్పటిసమైక్య పాలకులు అడ్డుపడ్డారనిఅన్నారు. తమకు న్యాయస్థానాల మీద పూర్తిగా గౌరవం ఉందని, నేడు బిలోలి సెషన్ కోర్టుకు హాజరు కావడం జరిగిందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News