Tuesday, February 11, 2025

పది నెలల సమయం సరిపోదా?

- Advertisement -
- Advertisement -

ఫిరాయింపు ఎంఎల్‌ఎల
అనర్హతపై నిర్ణయం
తీసుకోవడానికి ఇంకెంత
గడువు కావాలి?
అసెంబ్లీ స్పీకర్ తరఫు
లాయర్‌పై సుప్రీంకోర్టు
సీరియస్
ప్రజాస్వామ్యంలో
రాజకీయ పార్టీ
హక్కులకు భంగం
కలగరాదని వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీని మరోసారి సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడు వు కావాలని మరోసారి కీలక వ్యాఖ్యలు చే సింది. అందుకు స్పీకర్ తరపు న్యాయవా ది స్పందిస్తూ తమ నిర్ణయాన్ని తెలిపేందు కు మరో నాలుగైదు రోజుల సమయం ఇ వ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కేసులో తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు వాదనల సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ హక్కులకు భంగం కలగనివ్వరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల హక్కులకు భంగం కలగనివ్వరాదు.

శాస న, కార్యనిర్వాహక వ్యవస్థల పట్ల మాకు గౌరవం ఉంది. అయితే, దాని అర్థం పార్లమెంట్ తెచ్చిన చట్టానికే భంగం కలిగేలా వ్యవహరించనివ్వాలని కాదని బెంచ్ వ్యా ఖ్యానించింది. దానంనాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు సహా ఇతర ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై దాఖలైన అనర్హత పి టిషన్లతో కలిపి సోమవారం కేసు విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వి నోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. స్పీకర్ తరపున ము కుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన పది మంది ఎంఎల్‌ఎ లపైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది.

ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ఇటీవల తాజాగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్‌రెడ్డి, వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంఎల్‌ఎలపై పిటిషన్ వేయగా, మరో ఏడుగురి పేర్లను జత చేసి కెటిఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు బిఆర్‌ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రీజన్‌బుల్ టైం అంటే మూడు నెలలే అని వాదించారు. అనంతరం కేసు విచారణను 18కి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ క్రమంలో 18న జరగబోయే వాదనలపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News