Friday, November 22, 2024

12న కాంగ్రెస్‌లోకి గ్రేటర్ ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈనెల 12న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత కొన్నిరోజులుగా వివిధ పార్టీలతో మంతనాలు జరుపుతున్న గ్రేటర్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఈక్రమంలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తమ అనుచరవర్గాలతో సమావేశమై చేరికకు చర్చించినట్లు, శుక్రవారం చేరిక నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేయాలని సూచించినట్లు తెలిసింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందా,కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లకా్ష్మరెడ్డిలు ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో 12న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కాంగ్రెస్ అధికారంలోకి రావడం….పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘోర పరాభవం చెందడంతో బిఆర్‌ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని భావిస్తున్న ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్‌ను వీడేందుకే నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్నినెలలుగా పార్టీ కార్యక్రమాలకూ అంటిముట్టనట్టుగానే హాజరవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్,బిజెపి,టిడిపి నేతలతో కూడా మంతనాలు జరిపిన విషయం బహిరంగ రహాస్యమే. విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని బుజ్జగించినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. గ్రేటర్ పరిధిలోని 18 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, మిగిలిన వారు కూడా బిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకే నిర్ణయించారు. శుక్రవారం ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారని,

మిగతా ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లాలా అన్న అయోమయంలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేదు. దీంతో గ్రేటర్‌లో కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్న విషయమూ విధితమే. ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో త్వరలో గ్రేటర్ పరిధిలో బిఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News