Thursday, January 23, 2025

ఫామ్ హౌజ్‌లో కెసిఆర్‌తో ఎంఎల్ఎల భేటీ

- Advertisement -
- Advertisement -

మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షే్రత్రం సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో సందడిగా కనిపించింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తోపాటు తాజా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోసహా కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్ చేరుకుని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కెసిఆర్ ఆశీర్వాదాలను తీసుకున్నారు. కెసిఆర్ వారికి అభినందనలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, పోలింగ్ ఫలితాల సరళిపై కొద్దిసేపు వారితో కెసిఆర్ సమీక్షించారని సమాచారం.

తాజా రాజకీయ పరిణామాలపై కూడా వారు చర్చించారని తెలిసింది. రానున్న అసెంబ్లీ సమావేశాలలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోషించాల్సిన ప్రతిపక్ష పాత్ర, , భవిష్యత్ లో అనుసరించాల్సిన పార్టీ విధానాలు తదితర అంశాలపై ఈ బేటీలో ముచ్చటించారని తెలిసింది. సోమవారం మధ్యాహ్నం వచ్చిన వారంతా రాత్రి పొద్దుపోయే వరకు ఫామ్ హౌజ్‌లో కెసిఆర్‌తో గడిపి తిరిగి వెళ్లారు. కెసిఆర్ ఫాంహౌజ్‌కు వచ్చిన వారిలో హరీష్ రావుతోపాటు తాజామాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి,మల్లా రెడ్డి,దుబ్వాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు బట్టు అంజి రెడ్డి, జుబేర్ పాష తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News