Friday, January 3, 2025

డిజిపి ని కలిసిన బిఆర్ఎస్ నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఎంఎల్ఏ ల మీద జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నేతలు తెలంగాణ డిజిపి జితేందర్ ను కోరారు. వారంతా ఆయన కార్యాలయంలో కలిసి ఈ విన్నపం చేసుకున్నారు. ఇటీవల బిఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడులను ఆయనకు వివరించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో దాడిచేయించారని మొరబెట్టుకున్నారు.

ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు అరికెపూడి గాంధీ దాడికి వెళ్లిన ఘటనను కూడా వివరించారు. ఎంఎల్ఏ లకే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఏముంటుందని వారు ఈ సందర్భంగా డిజిపికి వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని బిఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు బిఆర్ఎస్ నాయకులు డిజిపిని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News