Monday, December 23, 2024

కంచెలే ప్రజాపాలనా?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల తరుఫున
పోరాటం చేస్తాం కెసిఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి
ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు
మీడియా పాయింట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం
ఒంటెద్దు పోకడలకు నిదర్శనం సభ
జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద
మాట్లాడొద్దంటూ నిబంధన ఏమీ లేదు సర్కార్
తీరుపై అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు బిఆర్‌ఎస్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు బి ఆర్‌ఎస్ సభ్యులకు వాగ్వాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు ఎందుకు వెళ్లకూడదు అంటూ కెటిఆర్, హరీష్ రావు పోలీసులతో వాదించారు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే ని బంధనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతం లో ఎప్పుడు లేని కొత్త నిబంధనలు ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రతిప క్ష సభ్యులను పోలీసులు అనుమతించలేదు. దీం తో అక్కడే బిఆర్‌ఎస్ సభ్యులు నేలపై కూర్చొని నిరసనలు తెలిపారు. అధికార కాంగ్రెస్‌పై ఆపార్టీ స భ్యులు విమర్శలు గుప్పించారు.

ఈసందర్భంగా ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి మాట్లాడుతూ అసెంబ్లీలో సిఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నామని, చెప్పలేని భాషలో ఇష్టానుసారంగా సిఎం హోదాలో మాట్లాడటం సరికాదన్నారు.అవి అ సెంబ్లీ రికార్డు అవుతాయని, రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిఎంభాషకు ధీటుగా బదులు ఇవ్వగలమని, కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉందని, ప్రతిపక్ష నేత కెసిఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదని, కనీసం బయట మీడియా తో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

గత పాలకులు వేసిన కంచెలు తొలగిస్తామని గంభీరాలు పలికిన రేవంత్‌రెడ్డి ఇదే నా కంచెల పాలనా  అంటే అని నిలదీశారు.సీనియర్ ఎమ్మెల్యే దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాష ను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభలో కడియం సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదని,సిఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దానిని తెలంగాణ భాషగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ భాషను సిఎం రేవంత్ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయం వెంటనే విరమించుకోవాలని, ఆయనకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు.అక్కడ కెసిఆర్ హయంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని, రెండు నెలలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందన్నారు. అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చి మా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.

ఆ నిబంధన లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఎక్కడ లేదని,తాను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేశానని ఎమ్మెల్యే వేములు ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోందని, సిఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడటానికి అవకాశం ఇస్తామని గొప్పగా చెప్పి తాము సభలో మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News