- Advertisement -
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేయడంతో శాసన సభ వాయిదాపడింది. సభను 15 నిమిషాల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాలలో ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బిఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోడియం ముందు బిఆర్‌ఎస్ సభ్యులు నిరసన తెలపడంతో వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని బిఆర్ఎస్ ఎంఎల్ఎలకు స్పీకర్ సూచించారు. కీలకమైన భూభారతి బిల్లుపై చర్చ జరగాలని, ఒక్క వ్యక్తి కోసం సభను అడ్డుకోవడం సరికాదని స్పీకర్ తెలిపారు. ఎసిబి కేసు నమోదు చేసిన తరువాత సభలో చర్చించే అవకాశం లేదని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ సభ్యులు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపణలు చేశారు.
- Advertisement -