Sunday, January 19, 2025

ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందని కెటిఆర్ తెలిపారు. ఎంపి, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందన్నారు. పదో షెడ్యూల్ చట్ట సవరణ హామీ స్వాగతించదగినది అని కెటిఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ఎప్పటిలాగే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కాంగ్రస్ విధానాలు ఉంటాయన్నారు.

ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంది.. అందులో ఒక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపి టికెట్ ఇచ్చిందని కెటిఆర్ తెలిపారు. హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులని స్వీకర్ ప్రకటించాలన్నారు. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్ నిరూపించుకోవాలని కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News