Friday, November 15, 2024

కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు ఠాకూర్ బాలాజీ సింగ్ తోపాటు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది వారి మద్దతుదారులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎఐసిసి అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు ఠాకూర్ బాలాజీ సింగ్, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులతోసహా 100 మందికిపైగా తమ మద్దతుదారులతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

టిపిసిసి అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో 17 రోజులు కొనసాగిందని, ఆ తర్వాత తెలంగాణలో సిడబ్లుసి సమావేశం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు,అప్పటి యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఆయన తెలిపారు. గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం తమ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News