Thursday, January 23, 2025

బిల్కిస్ బానో కేసు తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్వాగతించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.

ఈ మేరకు సోమవారం కవిత ఎక్స్(ట్విట్టర్)లో స్పందించారు. కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణకు ఎంఎల్‌సి కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News