Sunday, January 12, 2025

ఎంఎల్ సి కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మానకొండూర్: శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన 2కే రన్ వేడుకల్లో పాల్గొనేందుకు కౌశిక్‌రెడ్డి తన వాహనంలో కరీంనగర్ నుంచి హుజురాబాద్ బయలుదేరగా, శంషాబాద్ గ్రామ సమీపంలో అతడి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కౌశిక్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

శంషాబాద్ శివారులో భూస సంపత్ అనే రైతు తన పొలం వద్దకు వెళ్లేందుకుని రోడ్డు దాటుతున్నాడు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన కౌశిక్ రెడ్డి ఫార్చునర్ కారు రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొట్టింది. కారులోని ఏయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కౌశిక్ స్వల్పంగా గాయపడ్డాడు. అలాగే బైక్ పైనున్న సంపత్ స్వల్పంగా గాయపడగా, చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు. తదనంతరం కౌశిక్ తన కాన్వాయ్‌లో హుజూరాబాద్‌కు వెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News