Sunday, December 22, 2024

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను సిబిఐ విచారణకు అనుమతివ్వడంపై పిటిషన్ దాఖలైంది. కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి శుక్రవారం అనుమతి లభించింది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరుపు న్యాయవాది నితీష్ రాణా మెన్షన్ చేశారు. దరఖాస్తును సిబిఐ అందించలేదని న్యాయవాది తెలిపారు. సిబిఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని న్యాయవాది కోర్టును కోరారు. కవిత పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరుపుతామో మధ్యాహ్నం తెలుపుతామని కోర్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News