Monday, January 20, 2025

ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ‘జై తెలంగాణా’ అనడం వినలేదు: కవిత

- Advertisement -
- Advertisement -

గత అరవై రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బిఆర్ఎస్ నాయకురాలు కవిత అన్నారు. గత రెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి ఒకే ఒక్క రోజు ప్రజాదర్బార్ లో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నోట ఇప్పటివరకూ జై సోనియమ్మ అనే తప్ప జై తెలంగాణా అని ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యుటర్న్ సిఎం అంటున్నారని చెప్పారు.

కవిత శనివారం విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారని ఇది ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం జరిగిన సభకు అయిన ఖర్చెంత అని నిలదీశారు. ముఖ్యమంత్రి సోదరులు జిల్లా సమీక్షా సమావేశాల్లో ఏ హోదాతో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని పెడతారా పెట్టరా ముఖ్యమంత్రి తేల్చి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారని, వీటిని డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయో చెప్పాలని కవిత ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News