Friday, December 20, 2024

గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని కేటాయించారు..?

- Advertisement -
- Advertisement -

అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గ్రూప్-1 లో హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుందని కవిత పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ బిసి మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా? గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని కేటాయించారు? అని కవిత ప్రశ్నించారు. రోస్టుర్ పాయింట్ల రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. పాత పద్దతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని వెల్లడించారు. మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News