Monday, December 23, 2024

ప్రత్యేక సెల్ లో కవిత.. ఉదయం 10.30 తర్వాత సిబిఐ కోర్టుకు

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీలో ఉన్నారు. ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్ ఉన్న ఎమ్మెల్సీ కవితకు కాసేపటి క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించారు. అధికారులు కవితను ఉదయం 10.30 తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. కవిత అరెస్టుకు నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకర్గ కేంద్రాల్లో నిరసనలకు బిఆర్ఎస్ పిలుపునిచ్చింది. కవితను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రాల్లో బిఆర్ఎస్ నిరసనలకు దిగనుంది. కవిత అరెస్టును బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ గులాబీ పార్టీకి భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News