- Advertisement -
హైదరాబాద్: ఈడీకి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. తనను రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని తెలిపారు. తనపై ఈడీ దురుద్దేశంలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన ఫోన్లు ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని తెలిపారు. మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం స్వేచ్చకు భంగం కలిగించడమేనని ఆమె పేర్కొన్నారు. నవంబర్ లోనే ఫోన్లు ధ్వంసం చేసినట్లు ప్రచారం చేశారు.
కానీ తనకు నోటీసులు మాత్రం మార్చిలో ఇచ్చారని వెల్లడించారు. తనకు సమన్లు జారీ చేయకుండానే ఆరోపణలు ఎలా చేశారనని కవిత ప్రశ్నించారు. తొలిసారి మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిపించింది. కానీ… నవంబర్ లోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఎలా చెబుతారని ఈడీని ప్రశ్నించారు. తనపై ఈడీ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసు విచారణలో ఈడీకి సహకరిస్తున్నానని చెప్పుకొచ్చారు.
- Advertisement -