- Advertisement -
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష శుక్రవారం ముగిసింది. భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత దీక్ష చేపట్టారు. నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆడబిడ్డల వాటా రావాల్సిందేనన్నారు. ఆడబిడ్డల హక్కులను కాలరాసే జీవో-3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 3 విషయంలో గవర్నర్ స్పందించి న్యాయం చేయాలన్నారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు.
- Advertisement -