Monday, December 23, 2024

ప్రజల పైసలతో ఆటలా?: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అదానీ వ్యవహారంపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసి పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడంపై కవిత స్పందించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల పైసలతో ఆటలా? అని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. ఎల్‌ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే మౌనం ఎందుకని ఆమె ఫైర్ అయ్యారు.

సిబిఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా ఈ మౌనమని ఆమె ధ్వజమెత్తారు. ఆ సంస్థలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారా అని కవిత మండిపడ్డారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయాయని ఆమె పేర్కొన్నారు.
అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో…..
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని బిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీనిపై కేంద్రం స్పందించి జేపిసిని ఏర్పాటు చేసి ఉంటే ప్రజలు నష్టపోయేవారు కాదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని, జేపిసిని నియమించాలని ట్విట్టర్ వేదికగా కవిత డిమాండ్ చేశారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ వాటాలు భారీగా పతనమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News