Saturday, March 29, 2025

కవ్వాల్ టైగర్ జోన్ ను తొలగించాలి: ఎంపి నగేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిజెపి ఎంపి గోడం నగేష్ తెలిపారు. కవ్వాల్ టైగర్ జోన్ పై నగేష్  కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం మేరకే టైగర్ జోన్ నిర్మించారని అన్నారు. ప్రస్తుతం ప్రజల ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని నగేష్ విమర్శలు గుప్పించారు. ప్రజలపై ప్రేమ ఉంటే కవ్వాల్ టైగర్ జోన్ ను తొలగించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం చేసి పంపాలని ఎంపి నగేష్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News