Monday, January 20, 2025

బిఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 30న కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు విజయలక్ష్మి వెల్లడించారు. గురు వా రం కెసిఆర్‌తో సమావేశం అనంతరం కెకె మీడియాతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన అంశాలపై కెసిఆర్‌తో చర్చించినట్లు కెకె వెల్లడించారు. ’పార్టీ అంతర్గత అంశాల పై చర్చ జరిగింది. కవిత అరెస్ట్ గురించి కూ డా చర్చించాం. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు. కెసిఆర్ నాకు చాలా గౌర వం ఇ చ్చారు. నాకు కూడా కెసిఆర్‌పై గౌరవం ఉం ది. బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు బాగా స హకరించారు.

సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నా ను. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లానని అనుకుంటున్నాను. బిఆర్‌ఎస్‌లోనే కొనసాగాలన్న కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిది’ అని కేకే వెల్లడించారు. ఈ నెల 30 వ తేదీన కాంగ్రెస్‌లో చేరుతున్న ట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పను లు అవుతాయని, సమస్యలు పరిష్కరించ డం సులువని ఆమె వెల్లడించారు. మరోవై పు తాను బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని కెకె కుమారుడు  విప్లవ్ స్పష్టం చేశారు. కేకే, విజయలక్ష్మి నిర్ణయాలతో తనకు సంబం ధం లేదని వెల్లడించారు.

కేసిఆర్‌ను కలిసిన కెకె
అంతకు ముందు బిఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ కె. కేశవ రావు బిఆర్‌ఎస్ అధ్యకుడు కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో గులాబీ దళపతి కెసిఆర్‌ను కెకె కలిశారు కెసిఆర్‌తో భేటీలో పార్టీ మార్పుపై కె కె వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయి తే ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ తన నివాసానికి వచ్చిన కెకెతో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గడ్డం అరవింద్‌రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ నెల 30న ఇంద్రకరణ్‌రెడ్డి, గడ్డం అరవింద్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు : కెకె
కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు అని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికి చేరుతారని, తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కె కేశవరావు ప్రకటించారు. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, బిఆర్‌ఎస్‌లో తాను పనిచేసింది కేవలం పదేళ్లు మాత్రమే నన్నారు. తెలంగాణ కోసమే బిఆర్‌ఎస్‌లో చేరానని వెల్లడించారు. తాను మొదటిసారి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని గుర్తు చేశారు. తాను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్‌లోనేనన్నారు. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నానని వెల్లడించారు. తాను బిఆర్‌ఎస్‌కు ఇంకా రాజీనామా చేయలేదని, తన కూతురు చేరిన రోజున తాను కాంగ్రెస్‌లో చేరడం లేదన్నారు. ఏ రోజు కాంగ్రెస్‌లో చేరేది, తేదీ తర్వాత చెబుతానని వెల్లడించారు. తన కుమారుడు మాత్రం బిఆర్‌ఎస్‌లోనే ఉండాలనుకుంటున్నాడని, ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కెకె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News