Tuesday, January 21, 2025

నెల జీతం విరాళంగా ప్రకటించిన బిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌ఎలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు ముందుకొచ్చారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం మేరకు బుధవారం సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు విరాళాలను ప్రకటించారు. కాగా, ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యర్యంలో సహాయక చర్యలు చేపట్టిన విషయం విదితమే.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News