Wednesday, January 22, 2025

రాష్ట్రపతి ప్రసంగం ‘బహిష్కరణ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బిఆర్‌ఎస్ ఎంపిలు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. ఎన్‌డిఎ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిఆర్‌ఎస్ ఎంపిలు ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉద యం 11 గంటలకు ప్రారంభం కాగా పార్లమెంట్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్‌హాల్లో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపి కెకె మాట్లాడుతూ తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వై ఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన తెలిపారు. తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలి వివాదా స్పదంగా మారాయని ఆయన ఆరోపించారు.

వీటిని దేశ ప్రజల ముందు పెట్టేందుకే తా మీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై పార్లమెంట్లో చర్చ జరుగాలని డిమాండ్ చేశారు. కేం ద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుంది. కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలను తాము ఇరు సభల్లో ఎండగడుతామని, అఖిలపక్ష సమావేశంలోనూ తమ వైఖరిని స్పష్టంగా చెప్పామని కేకే పేర్కొన్నా రు. అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్లో కేం ద్రాన్ని నిలదీస్తామని కెకె స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే లేదని ఆయన విమర్శించారు. దేశంలో క్రోనీ క్యాపిటలిజమ్ నడుస్తోందని, ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోందని కెకె మండిపడ్డారు. ప్రభుత్వం మెచ్చిన బిజినెస్ మాగ్నెట్ గౌత మ్ అదానీ పేరుతో అదానీ చట్టం తీసుకొస్తే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో అదానీ యాక్ట్ తీసుకురమ్మని ప్రధానికి సూచన చేస్తే బా గుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కెకె సలహా ఇచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగంలో మహిళాబిల్లు ప్రస్తావన లేదు: నామా

రాష్ట్రపతి ప్రసంగంలో మహిళాబిల్లు ప్రస్తావన ఏదీ అని బిఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఎస్‌బిఐ, ఎల్‌ఐసీ షేర్లు పడిపోవడానికి కారణాలపై ఉభయ సభల్లో చర్చించాల్సి ఉందన్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను పార్లమెంట్‌లో ఎండగడతామని ఆయన తెలిపారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల ఆదాయం రెట్టింపుపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేసినట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు.

కేంద్రం తెలంగాణకు చేసిందీ ఏమీ లేదు ?

నూతన పార్లమెంట్ భవనానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తాము అఖిల పక్ష సమావేశంలో కోరామని, కానీ రాష్ట్రపతి ప్రసంగంలో ఆ సంగతి మరిచారని నామా కేంద్రం తీరుపై మండిపడ్డారు. తాము చేసిందే చెబుతాం, చెప్పేదే చేస్తాం తెలంగాణ అసెంబ్లీకి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాం, అలాగే పార్లమెంట్ నూతన భవనానికి ఆ మహానాయకుడు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, కేంద్రం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని నామా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసేందేమీ లేదనీ, పైగా తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుంటే తమ నాయకుడు కెసిఆర్ సొంత నిధులతో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, రైతుల ప్రయోజనాలు గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా మమ అనిపించారని నామా ఫైర్ అయ్యారు.

అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన అంశాలు….

అఖిలపక్ష సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ తరపున తాము లేవనెత్తిన ఏ ఒక్క అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ వైఖరికి నిదర్శనమని నామా పేర్కొన్నారు. ఇక రైతుల గురించి కూడా పైపైన మాట్లాడారని, అసలు విషయం ఊసే లేదనీ, తాము అఖిల పక్ష సమావేశంలో అడిగిన విధంగా రైతు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించడంతో పాటు రైతు చట్టాల నిరసన సందర్భంగా రైతులపై నమోదు చేసిన అన్ని రకాల కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశామని, కానీ రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా ఆ ఊసే లేదన్నారు. ఇక కేంద్రానికి ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతికహక్కే లేదని నామా ఆరోపించారు. ఈ 8 ఏళ్ల కాలంలో తమ నాయకుడు కెసిఆర్ ఇరిగేషన్ సర్వతోముఖాభివృద్ధికి సొంత నిధులు వెచ్చించారని, ప్రాజెక్టులు కట్టారని, ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తున్నారని, పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఇచ్చారని, నాయకుడంటే అలా ఉండాలని నామా పేర్కొన్నారు.

తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరందించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని నామా స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా కెసిఆర్ బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని, సొంతంగా నిధులు వెచ్చించి రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి, విద్య, వైద్య రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పైసా నిధులు ఇవ్వకపోయినా కెసిఆర్ నేతృత్వంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని నామా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తి, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ఎండగడతామని నామా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News