Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ ఎంపిల ధర్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్ ఎంపిలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్ మణిపూర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపిలు ప్రదర్శించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రజాస్వామ్య ఫెడరలిజానికి ముప్పు అని బిఆర్‌ఎస్ ఎంపిలు ఆరోపించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ సభలో చర్చ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు అప్రజాస్వామికమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్‌ఎస్ లోక్‌సభా నాయకుడు నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ఆయన తప్పుబట్టారు.
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపి సురేష్ రెడ్డి
విభజన చట్టంలో పలు సవరణలు తీసుకురావాలని కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎంపి కెఆర్ సురేష్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతోపాటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆ బిల్లులో ఎంపి కెఆర్ సురేష్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ జోన్ (ఐటీఐజడ్)ను నెలకొల్పాలని, దీనివల్ల 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఎంపి ఆ బిల్లులో పేర్కొన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, దాని ద్వారా పసుపు రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని ఎంపి సురేష్ రెడ్డి కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News