Thursday, November 14, 2024

బిఆర్‌ఎస్ ఆ ఆరు స్థానాల్లో ఎందుకు గెలవలేకపోతుంది…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఆ ఆరు స్థానాలు ఎందుకు గెలవలేకపోతుంది. టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఆ స్థానాల్లో విజయం సాధించలేదు. గోషామహల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి అశ్వారావు పేట నుంచి బిఆర్‌ఎస్ పోటీ చేస్తున్నా కూడా గెలవడం లేదు. ఎల్‌బి నగర్‌లో 2014, 2018లో బిఆర్‌ఎస్ ఓటమిని చవి చూసింది. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన దేవి రెడ్డి సుధీర్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు.
మహేశ్వర్‌లో 2018లో కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ నుంచి ఆమె విజయం సాధించారు. భద్రాది కొత్తగూడెం నుంచి తొలిసారి బిఆర్‌ఎస్ విజయం సాధించింది. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఘన విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News