Monday, December 23, 2024

రేపు ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలో బుధవారం భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి జనతాదళ్(సెక్యులర్), సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) నాయకులు హాజరు కానున్నారు. దేశ రాజధానిలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ఢిల్లీలో ఉన్న తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బిఆర్‌ఎస్ కార్యాలయం ‘ముహూర్తం’ ఇప్పటికే నిర్ణీతం అయిందని ఆయన తెలిపారు. ఆ ప్రారంభోత్సవ వేడుక మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 మధ్య ఉంది. కెసిఆర్‌గా పేరుగాంచి ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ జెండాను ఆవిష్కారం చేస్తారు. కార్యాలయాన్ని కూడా ప్రారంభించి తన ఛాంబర్‌లోనికి ప్రవేశిస్తారు.

బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్)నాయకుడు హెచ్‌డి. కుమారస్వామి, మరి కొంత మంది ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుంచి రైతు నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News