Sunday, December 29, 2024

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్రారంభమైంది. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వచ్చే లోక్ సభ ఎన్నికలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News