Sunday, December 29, 2024

కెసిఆర్ అధ్యక్షతన నేడు పార్లమెంటరీ పార్టీ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై భేటీలో చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో పార్టీ అనుసరించబోయే వైఖరి కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ విధానం, సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపిలకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కెసిఆర్ శుక్రవారం దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌పై కేంద్రం ఎంత మేరకు సీరియస్‌గా ఉందో చూడాలన్న ఆయన, కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కే పరిమితం అవుతారా, పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తారా వేచి చూడాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బిఆర్‌ఎస్ ఉందన్న రంజిత్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డినే అడగాలన్న ఆయన, ఆ తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. 60 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు తనపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని, తనకు సంస్కారం ఉందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News