Monday, December 23, 2024

ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా…

- Advertisement -
- Advertisement -

పెన్షన్ లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు
రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులను స్వయంగా కలుసుకోవడానికి మొదటి విడతలో భాగంగా 27 రోజుల్లో 51 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞత సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి వెల్లడించారు.

దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్‌కు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్థులు, ఇంచార్జ్‌లను సమన్వయం చేసుకుంటూ రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపులో తమ భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News